నేనెలా లైఫ్ లీడ్ చేయాలో నేర్పావు.. నీ రుణం ఎలా తీర్చుకోను ..
వీడ్కోలు వేదన కల్పించటానికి స్నేహం ప్రేమ గా పరావర్తనం చెందనక్కర్లేదు. ఆకాశం లో మేఘతరంగాలపై (ఫోన్ లో) నువ్వు నాలో కలిగించిన ఇన్స్పిరేషన్ నాకు తెరచాపలా వేలాడుతుంది . కాలం దాన్ని కబళిస్తుందని తెలియక చుస్తూ కూర్చున్నాను.
నిన్ను కోల్పోవడంతో నా జీవితం ఆగవచ్చు అగకపోవచ్చు. నాకు నేనే , నీ జ్ఞాపకాలే తోడై ఓదార్చాలి తప్ప మరి దారి లేదు. గాయపడిన నా మనస్సును తేలిక పరచాలంటే ఎన్నిఓదార్పుల శస్త్రచికిత్సలు కావాలో.
శిల్పం కోసం కొండల్లో రాళ్లను వెతికే శిల్పి హఠాత్తుగా ఓ రాయి దగ్గర ఆగి, తన భవిష్యత్ శిల్పానికి ఆ రాయి ని ఎన్నుకున్నట్లు , నువ్వు నన్నుఎంచుకున్నావా ? ఎవరడిగారు? ఎవరు పిలిచారని సగం చెక్కి వెళ్ళిపోయావు?
నా దుఃఖం చూసి నాకే సిగ్గేస్తుంది.. హృదయాన్ని సోకిన ప్రతి ఉత్తేజితపూరిత అనుభవాన్ని క్రోడికరిస్తే తయారైన వ్యక్తిత్వానివి నువ్వు. ఇదంతా ప్రేమే కాకపోవచు స్నేహమే కావొచ్చు!
ఇక నుంచి నేను మాటలాడే ప్రతీ మాట వెనుకా- చదివే పుస్తకం వెనుక - వాక్యం- శబ్దం అక్షరం- హృదయ స్పందన- మధ్య అంతా లీలగా విషాదమే కన్పిస్తుంటే అది నా తప్పు కాదు!
|
|
|

